
40 లీటర్ల సారా స్వాధీనం
● రెండు ద్విచక్ర వాహనాల సీజ్
● నిందితుల అరెస్టు
పాడేరు : మండలంలోని వంట్లమామిడిలో శనివారం అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లా ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు జరిపిన దాడుల్లో సారా తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 40 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. రెండు ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్టు పాడేరు ఎకై ్సజ్ సీఐ ఆచార్య విలేకరులకు తెలిపారు. రెండు జిల్లాల ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు వంటమామిడి వద్ద తనిఖీలు చేపట్టారు. దీనిలో భాగంగా అటువైపు వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలను ఆపి తనిఖీ చేయగా సారా ప్యాకెట్లు లభ్యమయ్యాయని ఆయన తెలిపారు. దీంతో గెంజిగెడ్డ గ్రామానికి చెందిన దూసురు రాము, గంజిమెట్టకు చెందిన కూడా బాలరాజు, కాశీపురానికి చెందిన ఓండ్రు రాము, లక్షీపేటకు చెందిన మత్య్సరాజును అరెస్టు చేశారు. సారా తయారీకి బెల్లం సరఫరా చేస్తున్నా కొప్పాక వెంకటరాజేశ్వరరావును అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. ఈ దాడుల్లో ఎకై ్సజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ జగదీశ్వరరావు, సబ్ ఇన్‌స్పెక్టర్ వీర్రాజు, సిబ్బంది ఎంఎస్ రాజు, రమేష్, కిరణ్ పాల్గొన్నారు.