
విద్యార్థిని అదృశ్యంపైకేసు నమోదు
సీలేరు : సీలేరు గ్రామం దుర్గా వీధిలో నివాసముంటున్న వి ద్యార్థిని అదృశ్యమైంది. ఎస్‌ఐ రవీంద్ర తెలిపిన వివరాలు ప్రకా రం దుర్గా వీధి లో నివాసం ఉంటున్న తండ్రి లక్ష్మణ్ తన కుమార్తె అయిన కొర్ర ప్రమీల సీలేరులో ఇంటర్ సెకండియర్ చదువుతుంది. గత శుక్రవారం నుంచి బాలిక కనిపించడం లేదని తల్లి కొర్ర మాలతి బుధవారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై కేసు నమోదు చేసి విద్యార్థిని కోసం గాలింపు చేస్తున్నామని ఎస్‌ఐ రవీంద్ర చెప్పారు ఆమె ఆచూకీ తెలిస్తే 9440904234 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.