
మదిమదిలో జెండా
స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో ఊరూరా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. పెదబయలులో 198 సీఆర్‌పీఎఫ్ బెటాలియన్ ఆధ్వర్యంలో మంగళవారం పోలీసు స్టేషన్ నుంచి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల వరకు జాతీయ పతాకాలు చేతపట్టి ర్యాలీ చేశారు. పెదబయలు అంబేడ్కర్ కూడలిలో భారత్ మాతకు జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీఆర్‌పీఎఫ్ పోలీసులు, స్థానిక సెయింట్ ఆన్స్ ఇంగ్లిష్ మీడియం పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎటపాకలో 212 సీఆర్‌పీఎఫ్ బెటాలియన్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. భారీ జెండాలతో ఎటపాక నుంచి భద్రాచలం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేశారు. కమాండెంట్ దీపక్‌కుమార్ శ్రీవాస్తవ, సెకండ్ కమాండ్ ఆఫీసర్ దినేష్‌కుమార్, డిప్యూటీ కమాండెంట్ అజయ్ ప్రతాప్‌సింగ్, డిప్యూటీ కమాండెంట్ గౌరవ శర్మ, అసిస్టెంట్ సూపరింటెండెంట్ విక్రాంత్‌కుమార్, 141 బెటాలియన్ సిబ్బంది, సివిల్, ట్రాఫిక్ పోలీసులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. జి.మాడుగులలో పోలీసుల ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ జరిగింది. పోలీస్ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ స్థానిక సర్కిల్ పోలీస్‌స్టేషన్ నుంచి ర్యాలీ జరిపారు. అనంతరం మానవహారం నిర్వహించారు. సీఐ బి.శ్రీనివాస్‌రావు, ఎస్‌ఐ ఎస్.షణ్ముఖరావు, సీఆర్‌పీఎఫ్ అసిస్టెంట్ కామాండెంట్ వినయ్‌గన్ పాల్గొన్నారు. –పెదబయలు/ఎటపాక/జి.మాడుగుల
మువ్వన్నెల
జి.మాడుగులలో విద్యార్థులతో మానవహారం నిర్వహిస్తున్న సీఐ శ్రీనివాస్‌రావు

మదిమదిలో జెండా

మదిమదిలో జెండా