
గ్రామాల అభివృద్ధికి ప్రణాళిక
● సమస్యల వివరాలను ప్రొఫార్మాలో అందించండి
● సర్పంచ్‌లకు ఐటీడీఏ పీవో సింహాచలం సూచన
రంపచోడవరం: గ్రామాలకు కావలసిన మౌలిక సదుపాయాలు, సమస్యల వివరాలను ఒక ప్రొఫా ర్మాలో అందిస్తే ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చర్య లు తీసుకోవడానికి వీలవుతుందని ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం అన్నారు. ఐటీడీఏ కాన్ఫరెన్స్ హాల్లో సర్పంచ్‌లు, కార్యదర్శులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆ వివరాలను పరిశీలించి సాధ్యమైనంత వరకు అమలు చేసేందుకు కృషి చేస్తామ ని చెప్పారు. ఆస్పత్రిలో ప్రసవమైన పిల్లలకు ముందుగా పేర్లు పెడితే 21 రోజుల్లో ఇంటి వద్దకే బర్త్ సర్టిఫికెట్లు వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. మారుమూల గ్రామాల్లోని గిరిజన బాలలు ఆధార్ కార్డు నమోదు చేసుకునే విధంగా ప్రత్యేక ఆధార్ కార్డు సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మారుమూల గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి అటవీ క్లియరెన్స్ ఇవ్వాలని, లింకు రోడ్లు, ప్రధాన రోడ్లు నిర్మించాలని, మంచినీటి సౌకర్యం కల్పించాలని, అంగన్‌వాడీ సెంటర్లకు పక్కా భవనాలు, విద్యుత్ స్తంభాలు, వీధిలైట్లు ఏర్పాటు చేయాలని వివిధ గ్రామాల సర్పంచ్‌లు కోరారు. పీవో స్పందించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. డీఎల్‌పీవో నరసింహారావు, పీఎంయూ అధికారి చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
నిరుపేద కుటుంబాలను దత్తత తీసుకోండి
ఏజెన్సీలో నిరుపేద కుటుంబాలను పీ4 ద్వారా దత్తత తీసుకొని, బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దాలని పీవో కట్టా సింహాచలం కోరారు. స్ధానిక వైటీసీ సమావేశ మందిరంలో మంగళవారం ఎంపీడీవోలు, సచివాలయ సిబ్బందితో పీ4పై సబ్ కలెక్టర్ శుభమ్ నొఖ్యాల్‌తో కలిసి సమావేశమయ్యారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను ఆదుకోవాలని సూచించారు.