ప్రకృతి సాగుతోనే భూమి సారవంతం
● రైతు సాధికార సంస్థ రాష్ట్ర
రిసోర్స్ పర్సన్ దేముళ్లు
పాడేరు రూరల్: ప్రకృతి సాగుతోనే భూసారం మరింత పెరుగుతుందని రైతు సాధికార సంస్థ రాష్ట్ర రిసోర్స్ పర్సన్ పి.దేముళ్లు తెలిపారు. బుధవారం ఆదివాసీ మిత్ర ఆధ్వర్యంలో గబ్బంగి రిసోర్స్ కేంద్రంలో రైతు ఉత్సవ్‌లో ఆయన పాల్గొన్నారు. గిరిజనులు పండించిన వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తులతో ప్రత్యేక స్టాల్ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా వాటిపై రైతులకు అవగాహన కల్పించారు. నాణ్యమైన ఉత్పత్తుల కోసం సేంద్రియ ఎరువులతో పండించాలన్నారు. సంస్థ డైరెక్టర్ మన్మథరావు, సంస్ధ ప్రతినిధులు గోపాలరావు, రాజేష్, రోహిత్,త్య్సరాజు పాల్గొన్నారు.


