రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
చింతూరు: మండలంలోని చట్టివద్ద జాతీయ రహదారి–30పై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వేగిశగండికి చెందిన కదల లచ్చమ్మ(50) అనే కొండరెడ్డి మహిళ మృతిచెందింది. ఆమె ఆదివారం ఇంటినుంచి మోతుగూడెం వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ఆటోలో వెళ్తున్న క్రమంలో కూనవరం జంక్షన్ వద్ద ఐరన్‌లోడుతో వస్తున్న లారీ వెనుకభాగం లచ్చమ్మ తలకు బలంగా ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయమైన ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఘటనాస్థలాన్ని చింతూరు ఎస్‌ఐ రమేష్ పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.


