
భారీ వర్షానికి పెంకుటిళ్లు నేలమట్టం
పిడుగుపాటుకు పశువులు మృతి
డుంబ్రిగుడ: మండలంలోని కొర్ర పంచాయితీ గొందివలసలో శుక్రవారం మధ్యాహ్నం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి తామర్ల చినపొట్టన్న, గెమ్మెలి వెంకటరావులకు చెందిన రెండు పెంకుటిళ్లు ధ్వంసమయ్యాయి. తిండి గింజలు, దుస్తులు తడిసిపోవడంతో రెండు కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. ప్రభుత్వం, అధికారులు స్పందించి ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.
చీడిపుట్లులో..
హుకుంపేట: మండలంలోని చీడిపుట్లు గ్రామంలో పిడుగుపాటుకు గురై తొమ్మిది దుక్కి పశువులు మృతి చెందాయి. శుక్రవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులు, పిడుగులతో భారీ వర్షం కురిసింది. రేగం సూరిబాబు, గేగం బోడయ్య, కొర్ర ఖరుజరమ్, రేగం బశ్వేశ్వరరావుకు చెందిన తొమ్మిది దుక్కిపశువులు మృతి చెందాయి. ఈఘటనలో సుమారు రూ.1.20 లక్షల నష్టం జరిగిందని బాధితులు తెలిపారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని వారు కోరారు.
రేగడిపాలెంలో..
వై.రామవరం: మండలంలోని రేగడిపాలెంలో గురువారం చింతచెట్టుపై పిడుగుపడటంతో అక్కడే ఉన్న ఐదు ఆవులు మృతిచెందాయి. గ్రామానికి చెందిన వెదుళ్ల చంద్రారెడ్డికి చెందిన 2, రాకోట వెంకటరెడ్డికి చెందిన ఒకటి, వెదుళ్ల బుల్లబ్బాయిరెడ్డికి చెందిన ఒకటి రోలిపల్లి సూరిబాబుకు చెందిన ఒక ఆవు మృతి చెందినట్లు సర్పంచ్ వెదుళ్ల సత్యన్నారాయణరెడ్డి తెలిపారు. మేలుజాతి ఆవులు కావడంతో సుమారు రూ.3లక్షల మేర ఆర్థిక నష్టం జరిగిందని ఆయన వివరించారు.

భారీ వర్షానికి పెంకుటిళ్లు నేలమట్టం

భారీ వర్షానికి పెంకుటిళ్లు నేలమట్టం