
19 నుంచి ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు
సాక్షి,పాడేరు: ఈనెల 19 నుంచి 28 వరకు ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో వేసవి శిక్షణ తరగతుల ప్రచార పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 7,837మంది విద్యార్థులు 46 కేంద్రాల్లో రాసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో 163(2) బీఎన్‌ఎస్‌ఎస్–2023 సెక్షన్ అమలుకు ఉత్తర్వులు జారీ చేశామని చెప్పారు. ఈ సెక్షన్ ప్రకారం పరీక్షా కేంద్రానికి సమీపంలో ఐదుగురు లేక అంతకన్నా ఎక్కువ మంది గుమిగుడి ఉండకూడదని తెలిపారు. కర్రలు, పేలుడు వస్తువులు, ఇతర ఆయుధాలు, రాళ్లు తీసుకుని రావడం నిషేధం అన్నారు. ఐదు,ఆరు తరగతి విద్యార్థులకు కమాల్ క్యాంపులు పేరిట ప్రథమ ఫౌండేషన్ నిర్వహిస్తున్న వేసవి శిక్షణా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
46 కేంద్రాల్లో పరీక్ష రాయనున్న 7837 మంది విద్యార్థులు
కలెక్టర్ దినేష్‌కుమార్