
ఆపరేషన్ సిందూర్ భారతీయుల మనోభావాలకు ప్రతీక
రంపచోడవరం: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతి చర్యగా ఆపరేషన్ సిందూర్‌తో భారత్ సత్తా చాటిన నేపథ్యంలో శుక్రవారం రంపచోడవరంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డి మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ కోట్లాది మంది భారతీయుల మనోభావాలకు ప్రతీక అన్నారు.
ఇదీ సైన్యం సాధించిన ఘన విజయమన్నారు. ఈ సందర్భంగా మాజీ సైనిక ఉద్యోగి గోవిందరావును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఈక బుల్లికొండలదొర, కారం సీతారామన్నదొర, గుడ్ల అంక శ్రీనివాసరెడ్డి, కేఎల్ ఎన్ గురుప్రసాద్, కుంజం వెంకటేశ్వర్లుదొర, కంగల శ్రీనివాసరావు, గౌస్ మొహిద్దిన్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి
రంపచోడవరంలో ఘనంగా తిరంగా ర్యాలీ