
రిమాండ్ ఖైదీ కుటుంబానికి ఆర్థిక సాయం
సాక్షి,పాడేరు: గంజాయి కేసులో చిత్తూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటూ మృతిచెందిన సరమండ ప్రవీణ్‌కుమార్(26) కుటుంబానికి ప్రభుత్వం రూ.5లక్షల ఆర్థిక సాయం మంజూరు చేసింది. జి.మాడుగుల మండలం గడుతూరు పంచాయతీ రాళ్లపుట్టు గ్రామానికి చెందిన ప్రవీణ్‌కుమార్ గంజాయి కేసులో పట్టుబడ్డాడు. రిమాండ్‌లో ఉన్న అతను మృతి చెందడంతో బాఽధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని జాతీయ మానవ హక్కుల సంఘం సిఫార్సు చేసింది. ఈ మేరకు రూ.5లక్షల ఆర్థిక సాయం చెక్కును మృతుడు కుటుంబానికి శుక్రవారం ఐటీడీఏలో కలెక్టర్ అందజేశారు.