
మన్యంలో విభిన్న వాతావరణం
ఉదయం మంచు.. మధ్యాహ్నం ఎండ, సాయంత్రం వాన
సాక్షి,పాడేరు/డుంబ్రిగుడ : గత 45 రోజులుగా మన్యంలో విభిన్న వాతావరణాన్ని జిల్లా ప్రజలు ఆస్వాదిసున్నారు. తెల్లవారు నుంచి ఉదయం 8 గంటల వరకు దట్టంగా పొగమంచు, సూర్యోదయం అయిన తరువాత మధ్యాహ్నం ఒంటిగంట వరకు అధిక ఎండతో సతమతమవుతున్నారు. మధ్యాహ్నం 3 గంటల తరువాత ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటున్నాయి. సాయంత్రం 4గంటల తరువాత ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తోంది. శుక్రవారం కూడా పాడేరుతో పాటు డుంబ్రిగుడ తదితర ప్రాంతాల్లో ఇదే వాతావరణం నెలకొంది.