
ఉచిత వైద్యశిబిరానికి విశేష స్పందన
రంపచోడవరం: రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో ఆదివారం సిరిగిందలపాడులో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. రామకృష్ణ మిషన్ కార్యదర్శి పరిజ్ఞేయనందజీ మహారాజ్ రోగులకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించారు. వైద్య శిబిరంలో 64 మంది రక్త పరీక్షలు నిర్వహించారు. పరమహంస యోగానంద నేత్రాలయం ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం నిర్వహించారు.45 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 15 మందికి కళ్లజోళ్లు అందజేశారు. కంటి ఆపరేషన్ల నిమిత్తం నలుగురిని వేమగిరి కంటి ఆస్పత్రికి తరలించారు. వైద్యశిబిరంలో వైద్యులు తలారి సుబ్బారావు, రాయుడు శ్రీనివాస్, దాసరి ఉమమహేష్ 200 మందికి వైద్య సేవలందించారు. క్యాంప్ ఇన్‌చార్జి లోకమయనందజీ మహారాజ్, క్యాంప్ కోఆర్డినేటర్ కానుమోను శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.