
‘మన మిత్ర’ యాప్ ద్వారా 250 రకాల సేవలు
రంపచోడవరం: మన మిత్ర వాట్సాప్ యాప్ ద్వారా 250 రకాల సేవలు పొందవచ్చని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం తెలిపారు. ఐటీడీఏ సమావేశపు హాలులో ప్రజల చేతిలో మన ప్రభుత్వం, మనమిత్రయాప్ కరపత్రాలను సబ్‌కలెక్టర్ కల్ప శ్రీతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏపీవో డి.ఎన్.వి.రమణ, ఈఈ శ్రీనివాసరావు, డీఎల్‌డీవో కోటేశ్వరరావు, తహసీల్దార్ పి.రామకృష్ణ, ఎంపీడీవో ఎస్. శ్రీనివాసరావు, డీడీ షరీఫ్ పాల్గొన్నారు.