
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కాపీలు దహనం
పాడేరు: ఇటీవల రాష్ట్రప్రభుత్వం విడుదల చేసిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కాపీలను స్పెషల్ డీఎస్సీ సాధన సమితి ఆధ్వర్యంలో పాడేరు రేకుల కాలనీ పీఎంఆర్సీ వద్ద ఆదివారం దహనం చేశారు. ఈ సందర్భంగా స్పెషల్ డీఎస్సీ సాధన సమితి నాయకులు కూడారాధాకృష్ణ, నాగేశ్వరరావు మాట్లాడు తూ ఆదివాసీ ప్రాంతంలో నిరుద్యోగుల కోసం తక్షణమే స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయా లని డిమాండ్ చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటీఫికేషన్‌లో ఆదివాసీలకు అన్యాయం జరిగిందని తెలిపారు. ఈనెల 30వతేదీలోగా ప్రభుత్వం ఆదివాసీ డీఎస్సీపై ప్రకటన చేయాలనిడిమాండ్ చేశారు. స్పెషల్ డీఎస్సీ సాధన సమితి నాయకులు భాను,ప్రతాప్, కుమారస్వామి,మహేష్,చిరంజీవి, మోహన్ పాల్గొన్నారు.
హుకుంపేట: మెగా డీఎస్సీతో ఆదివాసీలకు అన్యా యం జరుగుతోందని నాయకుడు కోటిబాబు, పీసా కమిటీ మండల ఉపాధ్యక్షుడు అప్పలకొండ అన్నారు. మండలంలోని గూడ గ్రామంలో డీఎస్సీ నోటిపికేషన్ పత్రాలను దహనం చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక డీఎస్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
జి.మాడుగుల: ఆదివాసీ ప్రాంతంలో శత శాతం ఉద్యోగాలు ఆదివాసీ నిరుద్యోగ యువతకే కల్పించాలని లయ స్వచ్ఛంద సంస్థ మండల కో–ఆర్డినేటర్ పాంగి మత్స్యరాజు, గిరిజన నిరుద్యోగులు డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా ఆదివారం కోరాపల్లిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు శతశాతం ఉద్యో గ అవకాశాలు కల్పించాలన్నారు. డీఈడీ, బీఈడీ అభ్యర్థులు చిరంజీవి, బాలకృష్ణ, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.
డుంబ్రిగుడ: జీవో నంబరు–3ను పునరుద్ధరించా లని, ఆదివాసీలకు ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కించుమండలో యువకులు ఆదివారం ర్యాలీ నిర్వహించారు. ఏజెన్సీలో పోస్టులను గిరిజనులతోనే భర్తీ చేయాలన్నారు.