
ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం
డుంబ్రిగుడ/చింతపల్లి/ జీకే వీధి/రంపచోడవరం/గంగవరం : జిల్లాలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు మాట్లాడుతూ పంచాయతీల ప్రక్షాళనతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా పీవీటీజీలకు అందజేస్తున్న గృహల నిర్మాణాలకు మండలంలోని అధికారులతో పాటు పంచాయతీ కార్యదర్శిలు సహకారించాలన్నారు. పంచాయతీ రాజ్ చట్టం ద్వారానే గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, దాని ద్వారానే నేడు పల్లెలో వెలుగులు చూడగలుగుతున్నామన్నారు. అరకులో జరిగి కార్యక్రమంలో సర్పంచ్ గగ్గుడు శారద ఆధ్వర్యంలో గృహ లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు. డుంబ్రిగుడలో జెడ్పీటీసీ చటారి జానకమ్మ, ఎంపీపీ బాకా ఈశ్వరి, ఎంపీడీవో ప్రేమ్‌సాగర్, వైఎస్ ఎంపీపీ శెట్టి ఆనంద్‌రావు తదితరులు పాల్గొన్నారు. చింతపల్లిలో ఎంపీపీ కోరాబు అనూషదేవి, జెడ్పీటీసీ సభ్యుడు పోతురాజు, వైస్ ఎంపీపీ శారద, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎంఈవో ప్రసాద్, పిఆర్ జెఇ బాలకిషోర్, గూడెంకొత్తవీధిలో దామనాపల్లి సర్పంచ్ కుందరి రామకృష్ణ, ఎంపీడీవో ఉమామహేశ్వరరావు, ఈవోపీఆర్డీ పాపారావు పాల్గొన్నారు. గంగవరంలోని ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, ఎంపీడీవో వై.లక్ష్మిణరావు , సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, పాల్గొన్నారు. రంపచోవరంలో సమీర్, చందు, రామకృష్ణ, సన్నీ, రవి, తేజ, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం