అందరికీ నచ్చేలా ‘సారంగపాణి జాతకం’ | - | Sakshi
Sakshi News home page

అందరికీ నచ్చేలా ‘సారంగపాణి జాతకం’

Apr 25 2025 8:04 AM | Updated on Apr 25 2025 8:04 AM

అందరికీ నచ్చేలా ‘సారంగపాణి జాతకం’

అందరికీ నచ్చేలా ‘సారంగపాణి జాతకం’

డాబాగార్డెన్స్‌: ‘సారంగపాణి జాతకం’లో తాను చేసిన పాత్ర, ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని హీరో ప్రియదర్శి తెలిపారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ప్రియదర్శి, రూపా కొడువాయూర్‌ జంటగా నటించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం రిలీజ్‌ కానున్న నేపథ్యంలో ఆ చిత్ర యూనిట్‌ గురువారం నగరంలో సందడి చేసింది. ఈ సందర్భంగా జగదాంబ సమీపంలోని ఓ హోటల్‌లో నిర్వహించిన సమావేశంలో హీరో ప్రియదర్శి మాట్లాడారు. తాను నటించిన మల్లేశం, బలగం, కోర్ట్‌ సినిమా తరహా భావోద్వేగాలతో సాగే ఓ సాధారణ వ్యక్తి కథే సారంగపాణి జాతకం అన్నారు. ఇంద్రగంటితో ఒక ఫొటో దిగితే చాలనుకునే వాడినని.. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో నటించడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రం కోసం ఇంద్రగంటే ఎక్కువ కష్టపడ్డారన్నారు. ఈ సినిమాలో ఆంధ్ర యాసలో డైలాగ్‌లు చెప్పినట్లు వివరించారు. హీరోయిన్‌ మాట్లాడుతూ అందర్నీ ఈ సినిమా ఆకట్టుకుంటుందన్నారు. ఆద్యంతం హాస్యంతో పాటు ప్రతీ సన్నివేశం ప్రేక్షకులను అలరిస్తుందన్నారు. దర్శకుడు ఇంద్రగంటి మాట్లాడుతూ విశాఖ అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. అష్టాచమ్మా చిత్రం విశాఖలో షూటింగ్‌ చేసి.. నానీని హీరోగా పరిచయం చేిసినట్లు చెప్పారు. మంచి కథతో అందరూ ఇష్టపడే హాస్యంతో రూపొందించిన ఈ సినిమాను ఆదరించాలని ప్రేక్షకులను కోరారు.

హీరో ప్రియదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement