
డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేస్తున్నాం..
రోజు రోజుకీ ఎండలు పెరిగిపోతున్నాయి. దానికనుగుణంగా విద్యుత్ వినియోగం కూడా పెరుగుతోంది. పెరిగిన విద్యుత్ కనెక్షన్లు, వాటి డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని విద్యుత్ సరఫరా చేస్తున్నాం. మే నెలలో మరింత ఎక్కువగా డిమాండ్ ఉండబోతోంది. దానికోసం ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఒకే సమయంలో అందరూ ఏసీలు, కూలర్లు ఆన్ చేస్తుండటంతో కొన్ని ప్రాంతాల్లో లోడ్ పెరిగి ట్రిప్ అవుతూ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. దీన్ని కూడా తక్కువ సమయంలోనూ పరిష్కరిస్తున్నాం. ఎంత అవసరమైనా కోతలు లేకుండా విద్యుత్ అందించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నాం.
– శ్యామ్‌బాబు, ఈపీడీసీఎల్ విశాఖ సర్కిల్ ఎస్‌ఈ