
చట్టి, వీరాపురం గ్రామాలను 41 కాంటూర్‌లో కలపాలి
చింతూరు: పోలవరం ముంపు ప్రాంతాలైన చట్టి, వీరాపురం గ్రామాలను 41.15 కాంటూర్‌లో కలిపి పునరావాసం కల్పించి, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేశారు. బుధవారం వారు చట్టి నుంచి చింతూరు ఐటీడీఏ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఐటీడీఏ ఏపీవోకు వినతి పత్రం అందజేశారు. గోదావరి వరదల సమయంలో ఈ రెండు గ్రామాలు ముంపునకు గురవుతుండడంతో తాము ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పిల్లలతో కలిసి కొండలెక్కి తలదాచుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన ఐటీడీఏ ఏపీవో జగన్నాథరావు మాట్లాడుతూ సమస్యను ఉన్నతాధికారులకు తెలియజేసి రెండు గ్రామాలకు న్యాయం చేస్తామని చెప్పారు.