సాక్షి, పాడేరు: స్థానిక గిరి కై లాస క్షేత్రంలోని ఉమా నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో శనివారం రాత్రి విద్యార్థులకు నిర్వహించిన భగవద్గీత శ్లోక పఠన పోటీలు విజయవంతంగా సాగాయి. ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సింహాచలంనాయుడు, ఇతర ఆధ్యాత్మిక కమిటీ ప్రతినిధుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలలో పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు భక్తిభావంతో భగవద్గీత శ్లోకాలను ఆలపించారు. న్యాయ నిర్ణేతలుగా ఆలయ గౌరవ అధ్యక్షులు తుడుము బాబూరావు, బొజ్జ త్రినాథ్, రవికుమార్, తమర్భ రమేష్‌కుమార్, ఎస్.సీతమ్మ వ్యవహరించారు. విజేతలకు ఉగాది పర్వదినం నాడు ఉత్తమ పురస్కారాలు అందజేయనున్నారు. ఆలయ కమిటీ ప్రతినిధులు కొట్టగుళ్లి రామారావు, దేశిది బాబూ రావు, రాజుబాబు, సోమరాజు పాల్గొన్నారు.


