గ్రామాల్లో ప్రధాన సమస్యలైన తాగునీరు, సీసీరోడ్లు, రహదారుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నచందంగా ఉన్నా యి. సమస్యల పరిష్కారం కోరుతూ ఇప్పటికి ఐటీడీఏలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మూడు సార్లు వినతులు అందించాం. దండబాబు నుంచి లింబగుడ వరకు ,దౌడగుడ నుంచి బెడ్డగుడ వరకు మంజురైన రహదారుల పనులు అటవీశాఖ అనుమతులు లేక నిలిచిపోయాయి. అధికారులు జోక్యం చేసుకుని పనులు ప్రాంభించేలా చర్యలు తీసుకోవాలి.
– గెమ్మెలి చిన్నబాబు, సుంకరమెట్ట
పంచాయతీ అరకులోయ మండలం