
ప్రకృతి వ్యవసాయంతో కాఫీలో అధిక దిగుబడులు
● కర్నాటక సీసీఆర్‌ఐ శాస్త్రవేత్త సౌందరరాజన్
సాక్షి,పాడేరు: జిల్లాలో కాఫీతోటలు సాగు చేస్తున్న గిరిజన రైతులంతా ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడులు సాధించవచ్చని కర్నాటక సీసీఆర్‌ఐ శాస్త్రవేత్త సౌందరరాజన్ తెలిపారు. కేంద్ర కాఫీబోర్డు ఆధ్వర్యంలో కాఫీ రైతులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు,ఆవుపేడ,మూత్రంతో ఎరువుల తయారీపై శుక్రవారం మినుములూరు కేంద్ర కాఫీబోర్డులో శిక్షణ ఇచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేంద్రియ ఎరువుల వినియోగం ద్వారా అధిక దిగుబడులతో పాటు ఆర్గానిక్ కాఫీని ఉత్పత్తి చేయవచ్చన్నారు. కాఫీతోటల్లో ఘన జీవామృతం,జీవామృతంలను వినియోగించడంతో మంచి ఫలితాలు ఉంటాయన్నారు.సేంద్రియ ఎరువులను ప్రతి కాఫీ రైతులు సొంతంగానే తయారు చేసుకుని కాఫీతోటలకు వినియోగించాలన్నారు.ఈ కార్యక్రమంలో మినుములూరు ఎస్‌ఎల్‌వో రమేష్,ఇతర అధికారులు పాల్గొన్నారు.