రంపచోడవరం/గంగవరం: ఏజెన్సీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రశాంతమైన వాతావరణం కల్పించాలని స్థానిక ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం తెలిపారు. సోమవారం స్థానిక ప్రభుత్వ హైస్కూలులో పరీక్ష కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏజెన్సీలో అన్ని పరీక్ష కేంద్రాలలో ఫ్యాన్లు, తాగునీరు, తదితర సౌకర్యాలు ఉండాలన్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. సహాయక గిరిజన సంక్షేమ శాఖ అధికారిని రామ తులసి తదితరులు పాల్గొన్నారు.
జి.మాడుగుల: స్థానిక గిరిజన సంక్షేమ బాలుర పాఠశాల, గాంధీనగరంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో పరీక్ష కేంద్రాలను జిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ అభిషేక్ గౌడ సోమవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. పరీక్షల తీరును, మౌలిక సదుపాయాల కల్పనను ఆయన పరిశీలించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్, జెరాక్స్ షాపులు మూసివేత పరిశీలించారు. మాస్ కాపీయింగ్‌కు పాల్పడకుండా విద్యార్థులు స్వశక్తితో చదివి ఉత్తీర్ణులు కావాలని సూచించారు.