పెదబయలు: విద్యార్థులు ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే ఉన్నత లక్ష్యంతో చదవాలని, అప్పుడు తాము అనుకున్న దాన్ని అందుకుంటారని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. మండలంలోని తురకలవలస గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలను ఆదివారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. వసతి గృహం కిచెన్‌ను పరిశీలించారు. విద్యార్థినులకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు. పాఠశాలలో ఈ నెల 3న 35 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయంపై ఉపాధ్యాయులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంచి చదువుతో పాటుగా వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యార్థినులకు అందించే రోజు వారి ఆహారం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దీనికి పాఠశాల హెచ్‌ఎం, వార్డెన్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం లేకుండా విద్యార్థినులకు సకాలంలో వైద్య సేవలు అందించడం వల్ల కోలుకున్నారన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గర్వించే స్థాయికి ఎదగాలన్నారు. అనుకున్నది సాధించాలంటే క్రమశిక్షణతో అవసరమన్నారు. టెన్త్ విద్యార్థినులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, భయం వదిలేయాలని, బెస్టాఫ్ లక్ చెప్పారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం