
వైభవంగా చందనోత్సవం
పద్మనాభం: స్థానిక కుంతీ మాధవ స్వామి ఆలయంలో చందనోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల నుంచి 4 వరకు కుంతీ మాధవ స్వామికి అర్చక స్వాములు చందనంతో అలంకరించారు. ముందుగా విశ్వక్షేన పూజ, పూణ్యాహవచనం జరిపారు. అనంతరం ఉదయం ఆరు గంటల నుంచి చందనం అలకంరణలో ఉన్న కుంతీ మాధవ స్వామిని దర్శించుకోవడానికి భక్తులకు ప్రవేశం కల్పించారు. వైఎస్సార్ సీపీ భీమునిపట్నం నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముత్తంశెట్టి మహేష్, జెడ్పీ వైస్ చైర్మన్ సుంకర గిరిబాబు, ఎంపీపీ కంటుబోతు రాంబాబు, వైఎస్సార్ సీపీ నాయకుడు తాలాడ పద్మనాభం స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పరిసర గ్రామాలైన మద్ది, కృష్ణాపురం, రెడ్డిపల్లి, విలాస్కాన్‌పాలెం, కురపల్లి నుంచే కాకుండా దూర ప్రాంతాలైన విశాఖపట్నం, విజయనగరం, భీమునిపట్నం నుంచి తరలివచ్చిన భక్తులు స్వామిని దర్శించుకున్నారు.