
పాడేరు ఘాట్, అనంతగిరిలో కురుస్తున్న మంచు
మినుములూరులో 22, చింతపల్లిలో 23 డిగ్రీల నమోదు
సాక్షి,పాడేరు: మన్యంలో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి.మొన్నటి వరకు ఉదయం సమయంలో కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల వరకు ఉండగా, గత రెండు రోజుల నుంచి చల్లటి వాతావరణం నెలకొంది. ఆదివారం ఉదయం పాడేరు, లంబసింగి, అరకులోయ ఘాట్ ప్రాంతాల్లో మంచు దట్టంగా కురిసింది. మినుములూరు కేంద్ర కాఫీబోర్డు వద్ద 22 డిగ్రీలు, చింతపల్లి కేంద్ర కాఫీబోర్డు వద్ద 23 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు అధికారవర్గాలు తెలిపాయి.సాయంత్రం నుంచి చల్లదనం నెలకొనగా, రాత్రి కాస్త చలిగాలులు వీచాయి. పాడేరు ఘాట్‌లో కూడా మంచు తెరలు అలుముకున్నాయి.
అనంతగిరిని కమ్మేసిన మంచు తెరలు
అనంతగిరి: మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం పొగమంచు దట్టంగా కమ్ముకుంది. ఎదురుగా ఉన్న వారు కనిపించలేనంతగా మంచుతెరలు కమ్మేశాయి. వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణాలు సాగించారు. అనంతగిరి ఘాట్‌రోడ్డులో ఇదే పరిస్థితి నెలకొంది. మంచు కారణంగా చలితీవ్రత పెరిగింది. వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
