
గిరిజన మ్యూజియంలో విల్లు ఎక్కిపెట్టిన అనంత నాయక్
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు అనంత్‌నాయక్
అరకులోయ టౌన్: ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయలోని గిరిజన మ్యూజియం అద్భుతమని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు, మాజీ ఎంపీ అనంత నాయక్ అన్నారు. శనివారం అరకులోయ పర్యటించిన ఆయన మ్యూజియంలో ఏర్పాటు చేసిన కళాఖండాలను చూసి మంత్రముగ్ధులయ్యారు. మ్యూజియం ఆవరణలో అనంత నాయక్‌తో స్థానిక బీజేపీ నేతలు, అధికారులు సెల్ఫీలు తీసుకున్నారు. అంతకు ముందు హరితవ్యాలీ రిసార్ట్స్‌లో భోజనం అనంతరం పద్మాపురం ఉద్యానవనం సందర్శించారు. టాయ్‌ట్రైన్‌లో గార్డెన్ అందాలు, ట్రీహట్స్‌ను తిలకించారు. గార్డెన్‌లో చెట్టు మోడును అందంగా తీర్చిదిద్దడాన్ని చూసి నిర్వాహకులను అభినందించారు. ఆయనకు గార్డెన్ మేనేజర్ లకే బొంజుబాబు, వెలుగు ఏపీఎం అప్పయ్యమ్మ, వీవోఏలు మజ్జి బుల్లి, తదితరులు స్వాగతం పలికారు. గిరిజన మ్యూజియం విశిష్టతను మేనేజర్ మురళి వివరించారు. వ్యక్తిగత కార్యదర్శి పరిడా, జాతీయ ఎస్టీ కమిషన్ డైరెక్టర్లు జయద్, రాధ, రాష్ట్ర లైజన్ ఆఫీసర్ జి.చినబాబు, జిల్లా లైజన్ ఆఫీసర్ ఐ. కొండలరావు, ఐటీడీఏ ఏపీవోలు వెంకటరావు, ప్రభాకర్‌రావు, ఏటీడబ్ల్యూవో మల్లికార్జునరావు, ఈవో రాజ్‌కుమార్ పాల్గొన్నారు. సీఐ సీహెచ్ రుద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎస్‌ఐలు సంతోష్, కుమార్ బందోబస్తు నిర్వహించారు.
మత్స్యలింగేశ్వరునికి ప్రత్యేక పూజలు
హుకుంపేట: మండలంలోని మత్యగుండం మత్స్యలింగేశ్వర స్వామిని శనివారం జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు అనంత్‌నాయక్ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయకమిటీ సభ్యులు,సర్పంచ్ శాంతకుమారి, ఎంపీడీవో వెంకటరావు ఆయనను సత్కరించారు. అనంతరం మఠం గ్రామంలోని అంధ్రా వనవాసీ కల్యాణ ఆశ్రమాన్ని సందర్శించారు. విద్యార్థులతో పాఠాలు చదివించారు. బీజేపీ నేతలు పాత్రుడు, మత్స్యకొండబాబు, సింహాచలం పాల్గొన్నారు.

వనవాసీ కల్యాణ్ ఆశ్రమంలో అనాఽథ పిల్లలతో అనంత నాయక్