సకాలంలో వైద్య సేవలు అందించండి

వైద్యాధికారులతో మాట్లాడుతున్నపీవో సూరజ్‌ గనోరే  
 - Sakshi

రంపచోడవరం ఐటీడీఏ పీవో సూరజ్‌గనోరే ఆదేశం

రంపచోడవరం: ఏజెన్సీలో పీహెచ్‌సీల ద్వారా సకాలంలో వైద్య సేవలు అందించాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో సూరజ్‌ గనోరే ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరం నుంచి రంపచోడవరం, చింతూరు డివిజన్ల పరిధిలోని 11 మండలాల పీహెచ్‌సీల వైద్యాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ద్వారా సంబంధిత పీహెచ్‌సీలోని గ్రామాల్లో ప్రతీ ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుని తగిన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏజెన్సీలో 30 ఏళ్లు దాటిన ప్రతి వ్యక్తికి పరీక్షలు నిర్వహించాలన్నారు. బీసీ, షుగర్‌, టీబీ, క్యాన్సర్‌ వ్యాధులు ఉన్న వారిని గుర్తించి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఐడీ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి గర్భిణి నెలలు నిండిన వెంటనే 15 రోజుల ముందు సంబంధిత పీహెచ్‌సీలో బర్త్‌ వెయిటింగ్‌ హాల్లో చేర్పించాలని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలలో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యంపై వైద్యాధికారులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. పీహెచ్‌సీల వాదీగా గర్భిణుల ఆరోగ్య పరిస్ధితిపై సమీక్షించారు. వైద్యులు క్షేత్రస్థాయి పర్యటన, సేవలపై ఆరా తీశారు. మలేరియా మందు స్ప్రేయింగ్‌పై సమీక్షించారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో మలేరియా స్ప్రేయింగ్‌ కు ఒక షెడ్యూల్‌ ఏర్పాటు చేసుకొని ఆ ప్రకారం పూర్తిచేయాలని సూచించారు. ఏడీఎంహెచ్‌వో డాక్టర్‌ అనూష, డాక్టర్‌ పుల్లయ్య, డాక్టర్‌ రాధిక, ఏఎంవో నక్కా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.




 

Read also in:
Back to Top