విద్యాభివృద్ధికి ప్రత్యేక కృషి | - | Sakshi
Sakshi News home page

విద్యాభివృద్ధికి ప్రత్యేక కృషి

Nov 24 2026 12:54 AM | Updated on Nov 24 2026 12:54 AM

ఇచ్చోడ: బోథ్‌ నియోజకవర్గంలో విద్యాభివృద్ధి కోసం ప్రత్యేక కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే అనిల్‌జాదవ్‌ అన్నారు. మండలంలోని కోకస్‌మన్నూర్‌ రోడ్డు వద్ద రూ.2 కోట్లతో నిర్మించనున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి సో మవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వచ్చే విద్యాసంవత్సరం నాటికి భవనం అందుబాటులో రానున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో పీజీగా అప్‌గ్రేడ్‌ చేసేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సి పాల్‌ శ్రీనివాస్‌, సర్పంచ్‌ ఇసూఫ్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు కృష్ణారెడ్డి, గాడ్గే సుభాష్‌, పాండురంగ్‌, రమేశ్‌, గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతరం మండల కేంద్రంలోని జెడ్పీ పాఠశాలలో రూ.5 కోట్లతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement