‘ఖేలో’పై విస్తృత ప్రచారం కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

‘ఖేలో’పై విస్తృత ప్రచారం కల్పించాలి

Nov 24 2026 12:54 AM | Updated on Nov 24 2026 12:54 AM

కై లాస్‌నగర్‌: రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్‌ 22 నుంచి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 8వ ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌పై జిల్లాలో విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్‌ రాజర్షి షా ఆదేశించారు. యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించడంతో పాటు ప్రజలకు క్రీడల ప్రాధాన్యతపై అవగాహన కల్పించేలా ప్రత్యే క కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఖేలో ఇండియా సెల్ఫీ పాయింట్‌ను సోమవారం ప్రారంభించారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, షాపింగ్‌ మాల్స్‌, సినిమా థియేటర్లు, ప్రధాన కూడళ్లు, క్రీడా మైదానాలు, పాఠశాలలు, కళాశాలల్లో ఖేలో ఇండియా క్రీడలకు సంబంధించిన ఫ్లెక్సీలు, కటౌట్లు, సెల్ఫీ పాయింట్లు ఏర్పా టు చేయాలని సూచించారు. ప్రచార కార్యక్రమాల్లో ప్రజలు, విద్యార్థులు, యువత అధిక సంఖ్యలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందులో అదనపు కలెక్టర్లు రాజేశ్వర్‌, చిత్రు, డీఆర్వో స్రవంతి, డీవైఎస్‌వో దయానంద్‌ రెడ్డి, గిరిజన క్రీడల అధికారి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.

తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి

జిల్లాలో వేసవి వరకు ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని కలెక్టర్‌ రాజర్షిషా ఆదేశించారు. సోమవా రం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టణానికి అవసరమైన తాగునీటిని ఫిబ్రవరి, మార్చి నాటికి అందుబాటులోకి తీసుకురావాలని, మిషన్‌ భగీరథ సంపులు, పైప్‌లైన్‌ లీకేజీల మరమ్మతులను తక్షణమే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో పంపుసెట్ల మరమ్మతులు, కొత్త మోటార్ల ఏర్పాటులో ఒక్క రోజు కూడా జాప్యం చేయకూడదని, చిన్నపాటి మరమ్మతులను డీపీవో, ఎంపీడీవోల సమన్వయంతో గ్రామ పంచాయతీల ద్వారానే పూర్తి చేయాలన్నారు. జిల్లావ్యాప్తంగా గ్రిడ్‌, ఇంట్రా పరిధిలో అవసరమైన అన్ని తాగునీటి పనులపై సమగ్ర ప్రతిపాదనలను రెండు, మూడు రోజుల్లోగా అందజేయాలని ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లో పైపులైన్ల ఏర్పాటుకు అటవీ అనుమతుల కోసం దరఖాస్తు చేయాలన్నారు. కాలువల నుంచి రాత్రివేళ అక్రమంగా నీటిని తోడే ఆయిల్‌ ఇంజిన్లను జప్తు చేసి కేసులు నమోదు చేయాలన్నారు. నాలాల వద్ద ఆక్రమణలు తొలగించిన తర్వాతే రక్షణ గోడలు నిర్మించాలని ఆదేశించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎస్‌.రాజేశ్వర్‌, ఇన్‌చార్జి జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ సుభాష్‌, భూగర్భజల శాఖ ఏడీ సతీశ్‌కుమార్‌, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రామారావు, డీపీవో రమేష్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జగదీశ్వర్‌ గౌడ్‌, ఇరిగేషన్‌ ఈఈ, ఇతర పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement