● తలమడుగును కరువు మండలంగా ప్రకటించాలని ఆందోళన
తలమడుగు: జిల్లాలో తలమడుగు మండలా న్ని కూడా కరువుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనచేపట్టారు. మండలంలోని సుంకిడి అంతర్రాష్ట్ర రహదారిపై రా స్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ మాట్లాడుతూ, మండలంలో వర్షాభావ పరిస్థి తి కారణంగా పంటలు పండక రైతులు తీవ్ర ఇ బ్బందుల్లో ఉన్నారన్నారు. మండలంలో ఇప్పటికే ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. నాలుగు గంటలపాటు కొనసాగిన ఆందోళనలతో రహదారికి ఇరువైపులా భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న తహసీల్దార్ రాజ్‌మోహన్, ఆది లాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి, సీఐ రహీం పాషా అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. జిల్లా అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చే వర కు విరమించేది లేదని స్పష్టం చేశారు. ఈమేరకు ఆర్డీవో జగదీశ్వర్‌రావు అక్కడికి చేరుకుని తప్పనిసరిగా కరువు మండలంగా ప్రకటించేలా చూస్తామని అన్నారు. దీంతో రైతులు శాంతించారు. కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు గణేశ్, జేఏసీ నాయకులు పద్మాకర్ రెడ్డి, కిరణ్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి, కేదారేశ్వర్‌రెడ్డి, ప్రకాశ్, మౌనిష్‌రెడ్డి, చంటి, జ్ఞానేశ్వర్, పొచ్చన్న తదితరులు పాల్గొన్నారు.
అధికారుల కాళ్లపై పడి వేడుకున్న రైతు
‘సార్.. దండం పెడతా.. కాళ్లు మొక్కుతా.. తలమడుగును కరువు మండలంగా ప్రకటించాలి..’ అంటూ రైతు లస్మన్న అధికారులను ధీ నంగా వేడుకున్నాడు. ఆర్డీవో జగదీశ్వర్‌రావు, తహసీల్దార్ రాజ్‌మోహన్ కాళ్లపై పడి సార్.. జిల్లాలోని అన్ని మండలాలను కరువుగా ప్రకటించారు.. మేమేం పాపం చేశాం.. అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.


