జైనథ్‌ ఆలయంలో.. | - | Sakshi
Sakshi News home page

జైనథ్‌ ఆలయంలో..

Nov 22 2026 2:53 AM | Updated on Nov 22 2026 2:53 AM

జైనథ్‌: కార్తికమాస శుక్ల పక్ష ద్వాదశి పర్వదినం పురస్కరించుకుని మండల కేంద్రంలో శనివారం రాత్రి శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి కల్యాణాన్ని కనులపండువగా సాగింది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అర్చకులు స్వామివారిని రమాదేవి, గోదాదేవి సమేతంగా మంగళవాయిద్యాల నడుమ మండపానికి తీసుకువచ్చారు. పురోహితులు శాస్తోక్త్రంగా కల్యాణ ఘట్టాన్ని నిర్వహించారు. జీలకర్ర బెల్లం, మంగళసూత్రధారణ, తలంబ్రాల ఘట్టాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. జైనథ్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది భక్తులు తరలివచ్చారు. ఈవో చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement