ఆదిలాబాద్: కార్తిక పౌర్ణమి సందర్భంగా జిల్లా కేంద్రంలోని అంకోలి రోడ్లోగల రాజరాజేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం జ్వాలాతోరణ మహోత్సవాన్ని నిర్వహించారు. సాయంత్రం ప్రత్యేక పూ జల అనంతరం జ్వాలాతోరణాన్ని వెలిగించగా ఆల య ప్రాంగణం దీపకాంతులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులు అధికసంఖ్యలో వచ్చి జ్వాలాతోరణం గుండా వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. కార్తిక పౌర్ణమి సందర్భంగా జ్వాలాతోరణ దర్శనం అత్యంత పవిత్రమైందని, ఇందులో పాల్గొంటే ఆధ్యాత్మిక ఆనందం, మనశ్శాంతి కలుగుతాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు.


