కార్తికం.. దేదీప్యం | - | Sakshi
Sakshi News home page

కార్తికం.. దేదీప్యం

Nov 24 2026 11:50 PM | Updated on Nov 24 2026 11:50 PM

ఆకాశంలోని తారలన్నీ నేలపైకి దిగివచ్చాయా అన్నట్లుగా జిల్లా కేంద్రంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం ఆలయ ప్రాంగణమంతా దీపకాంతులతో దేదీప్యమానమైంది. కార్తిక పౌర్ణమి సందర్భంగా మంగళవారం నిర్వహించిన దీపోత్సవం భక్తిభావాన్ని చాటింది. వేకువజామునే ఆలయానికి అధికసంఖ్యలో చేరుకున్న భక్తులు దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కాకడ హారతిలో పాల్గొని శ్రీరామచంద్ర స్వామివారితో పాటు శ్రీరుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణుడిని దర్శించుకుని భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. దీపాల వెలుగులు.. భక్తుల పూజలు.. హారతి కాంతులతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకుంది. – ఆదిలాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement