ఏజెన్సీ సమస్యలు పరిష్కరించాలని వినతి | - | Sakshi
Sakshi News home page

ఏజెన్సీ సమస్యలు పరిష్కరించాలని వినతి

Nov 19 2026 12:13 AM | Updated on Nov 19 2026 12:13 AM

ఉట్నూర్‌రూరల్‌: తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీ, గిరిజన నిరుద్యోగ యువత, ఆశ్రమ పాఠశాలల సమస్యలను పార్లమెంటరీ స్థాయిలో పరిష్కరించాలని కోరుతూ ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ నాయకులు బుధవారం పార్లమెంటరీ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్‌ డా.ఫగ్గన్‌ సింగ్‌ కులస్తేను కలిసి వినతిపత్రం అందజేశారు. ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ ప్రధాన కార్యదర్శి జాదవ్‌ సుమేష్‌, తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్‌ భుక్య కుమార్‌, ధరమ్‌ సింగ్‌ జాదవ్‌ తదితరులు మాట్లాడుతూ.. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్‌ హక్కులను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు. నియామకాల్లో స్థానిక గిరిజనులకు 75 శాతం రిజర్వేషన్‌ అమలుతో పాటు జీవో నెం.3 అంశాలపై స్పష్టతనిచ్చి, ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement