కాంట్రాక్ట్‌ అధ్యాపకుల నిరసన | - | Sakshi
Sakshi News home page

కాంట్రాక్ట్‌ అధ్యాపకుల నిరసన

Nov 19 2026 12:13 AM | Updated on Nov 19 2026 12:13 AM

బాసర: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ యూనివర్సిటీ టీచర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ కాంట్రాక్ట్‌ (యూటీఏసీ) పిలుపు మేరకు బాసర ఆర్జీయూకేటీలో అధ్యాపకులు బుధవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. యూటీఏసీ జనరల్‌ సెక్రటరీ డాక్టర్‌ కే. కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేశారు. యూజీసీ పేస్కేళ్లు అమలు చేయడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. రాష్ట్రవ్యాప్త ఉద్యమంలో భాగంగా నవంబర్‌ 19న నిరసన ర్యాలీలు, 20న మానవహారాలు, 21న మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement