ఇచ్చోడ: కూలీ పనులకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. నార్నూర్ మండలంలోని మాంజిరి గ్రామానికి చెందిన దుర్వ జగ్గెరావు (39) మరికొంత మందితో కలిసి బొలేరో వాహనంలో మహరాష్ట్రలోని కోల్హపూర్కు కూలీ కోసం వెళ్తున్నాడు. ఇచ్చోడ సమీపంలో 44వ జాతీయ రహదారిపై మైనార్టీ స్కూల్ వద్ద హైవే పక్కనే ఉన్న దాబాలో టీ తాగడానికి రోడ్డు దాటుతుండుగా గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో జగ్గెరావు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.


