కేంద్ర ప్రభుత్వ పింఛన్‌దారులకు ప్రయోజనం జీవన్ ప్రమాణ్ వెబ్‌సైట్ తీసుకొచ్చిన కేంద్రం మీసేవ కేంద్రాలతోపాటు సెల్‌ఫోన్ ద్వారా కూడా సేవలు
నిర్మల్‌చైన్‌గేట్: కేంద్ర ప్రభుత్వరంగ శాఖలు, వివిధ సంస్థల్లో పని చేసి పింఛన్ పొందుతున్న రిటైర్డ్ సిబ్బంది ఇక ఇంటి నుంచే లైఫ్ సర్టిఫికెట్ సమర్పించవచ్చు. కేంద్ర ప్రభుత్వ పింఛన్‌దారులు ఏటా నవంబర్‌లో బ్యాంకుల్లో, సంబంధిత అధికారులకు సర్టిఫికెట్లు అందజేసేవారు. కానీ కేంద్ర ప్రభుత్వం వారు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేందుకు జీవన్ ప్రమాణ్ వెబ్‌సైట్, యాప్ తీసుకొచ్చింది.
ఆన్‌లైన్‌లో నమోదు ఇలా..
మీ సేవ కేంద్రాలతో పాటు ఇంటి నుంచే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించవచ్చు. దీని కోసం https:// jeevanpramaan. gov. in వెబ్‌సైట్‌లో లాగిన్ కావాలి. పేజీ కింది భాగంలో ఆండ్రాయిడ్ ఆధారిత మొబైల్ ఫోన్, టాబ్లెట్ లేదా విండోస్ కంప్యూటర్, ల్యాప్‌టాప్ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆపై అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆధార్ సంఖ్య, పెన్షన్ పేమెంట్ ఆర్డర్, బ్యాంకు అకౌంట్ వివరాలు, మొబైల్ నంబర్ నమోదు చేయాలి. అనంతరం ఒక నంబరు కేటాయిస్తూ మొబైల్‌కు ఎస్‌ఎంఎస్ వస్తుంది. ఈ నంబర్‌ను పెన్షన్ పంపిణీ సంస్థకు ఆన్‌లైన్‌లో పంపవచ్చు. ఆన్‌లైన్‌లో చేయలేని వారు జీవన్ ప్రమాణ్ సెంటర్లను సంప్రదించవచ్చు. జీవన్ ప్రమాణ్ వెబ్‌సైట్‌లో లొకేటెడ్ సెంటర్ కాలమ్ క్లిక్ చేస్తే జిల్లాలో సిటిజన్ సర్వీస్ సెంటర్, ఫోన్ నంబర్, చిరునామాతో పాటు చిరునామా గూగుల్ మ్యాప్‌లో కనిపిస్తుంది. నెట్ అందుబాటులో లేని వారు సమీపంలోని జీవన్ ప్రమాణ్ సెంటర్ల జాబితా పొందడానికి ఫోన్ నుంచి జేపీఎల్ అని ఆంగ్ల అక్షరాలు టైప్ చేసి స్పేస్ ఇచ్చి పిన్‌కోడ్‌ను 7738299899 నంబర్‌కు ఎస్‌ఎంఎస్ చేయవచ్చు. అదనపు సమాచారం కోసం జీవన్ ప్రమాణ్ హెల్ప్‌డెస్క్ 1800111555ను సంప్రదించవచ్చు.
ఆధార్ అనుసంధానంతో..
డిజిటల్ సేవలు ఆధార్ అనుసంధానంగా జరుగుతాయి. బయోమెట్రిక్, ఐరిస్ విధానంలో డిజిటల్ లైవ్ (జీవన్ ప్రమాణ్) సర్టిఫికెట్ జారీ చేస్తున్నారు. ఈ సేవలను పెన్షనర్లకు అందించేందుకు ఉమ్మడి జిల్లాలోని మీసేవ కేంద్రాలకు సైతం అవకాశం కల్పించారు. దీంతో పాటు పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు సెల్‌ఫోన్ల ద్వారా జీవన్ ప్రమాణ్ సర్టిఫికెట్లను నమోదు చేస్తున్నారు. సిటిజన్ సర్వీస్ సెంటర్ల వద్దకు వెళ్లి బొటన వేలి ముద్ర ద్వారా వివరాలు నమోదు చేసుకుని జీవన్ ప్రమాణ్ గుర్తింపు సంఖ్య పొందవచ్చు.


