ఆర్టీసీ బస్సు, బైక్‌ ఢీ.. ఒకరు మృతి | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు, బైక్‌ ఢీ.. ఒకరు మృతి

Nov 19 2026 12:13 AM | Updated on Nov 19 2026 12:13 AM

భైంసాటౌన్‌: పట్టణంలోని రిలయన్స్‌ పెట్రోల్‌ పంపు సమీపంలో ఆర్టీసీ బస్సు, బైక్‌ ఢీకొన్న ఘటనలో నగేశ్‌(35) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఏపీనగర్‌కు చెందిన నగేశ్‌, సైదులు బుధవారం ఉదయం భైంసా నుంచి బాసర వైపు వెళ్తున్నారు. రిలయన్స్‌ పెట్రోల్‌ పంపు వద్దకు చేరుకోగానే ముందున్న వాహనాలను ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో నిజామాబాద్‌ నుంచి ఎదురుగా వస్తున్న భైంసా డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును ఢీకొన్నారు. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న నగేశ్‌ మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైన సైదులును స్థానిక ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్‌కు తరలించారు. ఆర్టీసీ బస్‌ డ్రైవర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ సాయికుమార్‌ తెలిపారు. నగేశ్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

లారీని ఢీకొన్న బైక్‌.. ఒకరు..

నేరడిగొండ: ఆగి ఉన్న లారీని బైక్‌ ఢీకొన్న ఘటనలో గు త్పాల గ్రామ మాజీ సర్పంచ్‌ గస్కంటి రవి(45) మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వి వరాల ప్రకారం.. బుధవారం గస్కంటి రవి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా రోల్‌మామడ టోల్‌ప్లాజా సమీపంలో రహదారిపై నిలిపి ఉంచిన లారీని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఆ యన తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థాని కులు 108 అంబులెన్స్‌లో రిమ్స్‌ ఆస్పత్రికి తరలి స్తుండగామార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు.

ప్రమాదవశాత్తు మొక్కజొన్న పంట దగ్ధం

తాంసి: భీంపూర్‌ మండలం పిప్పల్‌కోటి శివారులో మంగళవారం సాయంత్రం ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. స్థానికుల వివరాల ప్రకారం జావిద్‌ అనే రైతు కౌలుకు తీసుకొని 10 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాడు. సాగు చేసిన పంటకు ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగి మంటలు భారీగా వ్యాప్తి చెందడంతో పంట పూర్తిగా కాలిపోయింది. మరో వారం రోజుల్లో పంట చేతికొచ్చే సమయంలో భారీ నష్టం సంభవించిందని రైతు వాపోయాడు. దాదాపు రూ.8లక్షలకు పైగా నష్టం జరిగిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు న్యాయం చేసి ఆదుకోవాలని రైతు కోరుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement