కై లాస్‌నగర్: రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహించనున్నఖేలో ఇండియా యూత్ గేమ్స్‌పై విస్తృత ప్రచారం కల్పిస్తూ విజ యవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజ య్‌జాజు ఆదేశించారు. హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో సోమవారం నిర్వహించిన వీడి యో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. డిసెంబర్ 11 నుంచి 22 వరకు నిర్వహించనున్న పోటీల్లో ప్రజలు, విద్యార్థులు, యువతను భాగస్వాములను చేయాలన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వివిధ సంస్థల నుంచి 6,000 మందికి పైగా యువ క్రీడాకారులు, 1,800 మంది సహాయక సిబ్బంది ఈ క్రీడా సంబురాల్లో పాల్గొననున్నారని తెలి పా రు. మొత్తం 29 క్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు. హైదరాబాద్‌తో పాటు ఖమ్మం, హన్మకొండ, కరీంనగర్, నిజా మాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వివిధ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో కలెక్టర్ రాజర్షి షా, డీవైఎస్‌వో దయానంద్ రెడ్డి , గిరిజన క్రీడల అధికారి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.


