నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు | - | Sakshi
Sakshi News home page

నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు

Nov 17 2026 12:14 AM | Updated on Nov 17 2026 12:14 AM

కై లాస్‌నగర్‌: ఎల్‌నినో ప్రభావంతో వేసవిలో నీటి కొరత తలెత్తే అవకాశాల దృష్ట్యా జిల్లాలో ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ రాజర్షి షా ఆదేశించారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని గ్రామాలు, మారుమూల ఆవాసాల వరకు ఎలాంటి అంతరాయం లేకుండా రక్షిత తాగునీరు అందించాలన్నారు. పశువులకు సైతం నీటి కొరత లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రజలు కూడా నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్‌, డీపీవో రమేశ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ శ్రావణ్‌ కుమార్‌, మున్సిపల్‌ ఇంజినీర్‌ అరుణ్‌కుమార్‌, పశు సంవర్ధకశాఖ అధికారి రాథోడ్‌ రామారావు, ట్రాన్స్‌కో ఎస్‌ఈ సుభాష్‌ తదితరులు పాల్గొన్నారు.

19 నుంచి ‘ఇందిరమ్మ బీమా’

ఈ నెల 19 నుంచి ప్రారంభమయ్యే ఇందిరమ్మ కు టుంబ బీమా పథకం పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్‌ రాజర్షిషా ఆదేశించారు. సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి సంబంధిత శాఖ ల అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 19న ప్రారంభమై నెల రోజులపాటు ప్రత్యేక శిబిరా లు కొనసాగుతాయన్నారు. ప్రతీ గ్రామ పంచాయతీకి లేదా వార్డుకు ఒక అధికారిని, పర్యవేక్షణ కోసం మూడు లేదా నాలుగు జీపీలకు ఒక ప్రత్యేక అధి కారిని ఏర్పాటు చేయాలన్నారు. అలాగే మండల స్థాయిలో ఒక ప్రత్యేక అధికారిని నియమించాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తు ప్రక్రియలో భాగంగా ఫారంలో రేషన్‌కార్డు డేటా ఆటోమేటిక్‌గా వస్తుందని తెలిపారు. ఆ సమాచారం ఉన్నవారి వద్ద కేవలం నామినీ వివరాలు నమోదు చేసి లబ్ధిదారుల సంతకం తీసుకొని ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. నెట్‌వర్క్‌ లేని ప్రాంతాల్లో లేదా ఫారంలో వివరాలు రాని పక్షంలో, భౌతికంగా ఫారంలు ప్రింట్‌ తీసుకుని, వాటిపై లబ్ధిదారుల నుంచి సంతకాలు సేకరించాలని ఆదేశించారు. ఇందులో డీఆర్డీవో రాథోడ్‌ రవీందర్‌, జెడ్పీ సీఈవో రవి, డీపీవో రమేశ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జగదీశ్వర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ను కలిసిన డీఐఈవో

ఆదిలాబాద్‌ డీఐఈవోగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన మొహమ్మద్‌ ఖైజర్‌ పాషా సోమవారం కలెక్టర్‌ రాజర్షి షాను మర్యాదపూర్వకంగా కలిశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement