హోరాహోరీగా రాష్ట్రస్థాయి స్విమ్మింగ్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

హోరాహోరీగా రాష్ట్రస్థాయి స్విమ్మింగ్‌ పోటీలు

Nov 17 2026 12:14 AM | Updated on Nov 17 2026 12:14 AM

● ఆధిపత్యం చాటిన హైదరాబాద్‌, రంగారెడ్డి ● 100 మీటర్ల బటర్‌ఫ్లై బాలురలో ధారా ప్రతీక్‌ (హైదరాబాద్‌) స్వర్ణం, కేతన్‌ రాఘవ (రంగారెడ్డి) రజతం, రియాన్స్‌ తోట (హైదరాబాద్‌) కాంస్యం సాధించారు. బాలికల్లో హవిష (హైదరాబాద్‌) స్వర్ణం, అభినయ (హైదరాబాద్‌) రజతం, సహస్ర (రంగారెడ్డి) కాంస్యం దక్కించుకున్నారు. ● 50 మీటర్ల ఫ్రీస్టైల్‌ బాలురలో మోక్ష చంద్ర (ఖమ్మం) స్వర్ణం, శశిధర్‌ (రంగారెడ్డి) రజతం, బి. కార్తీక్‌ (హైదరాబాద్‌) కాంస్యం సాధించారు. బాలికల్లో పాలిని (రంగారెడ్డి) స్వర్ణం, సంయుక్త (రంగారెడ్డి) రజతం, అనన్య (మెదక్‌) కాంస్యం గెలుచుకున్నారు. ● 400 మీటర్ల ఫ్రీస్టైల్‌ బాలురలో రియాన్స్‌ (హైదరాబాద్‌) స్వర్ణం, అర్ణవ్‌ రెడ్డి (రంగారెడ్డి) రజతం, దేవాంశ్‌ రాజ్‌ సింగ్‌ (హైదరాబాద్‌) కాంస్యం సాధించారు. బాలికల్లో మానస్వి (మెదక్‌) స్వర్ణం, సహస్ర (రంగారెడ్డి) రజతం, హర్షిత (హైదరాబాద్‌) కాంస్యం దక్కించుకున్నారు. ● 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ బాలికల్లో రిషిక కృష్ణ (రంగారెడ్డి) స్వర్ణం, హర్షిత (హైదరాాబాద్‌) రజతం, నుహా ఫాతిమా (రంగారెడ్డి) కాంస్యం సాధించారు. బాలురలో పపృథ్వీరాజ్‌ (రంగారెడ్డి) స్వర్ణం, అప్రీత్‌ కోడే (రంగారెడ్డి) రజతం, దేవాంశ్‌ రాజ్‌ సింగ్‌ (హైదరాబాద్‌) కాంస్యం గెలుచుకున్నారు. ● 50 మీటర్ల బటర్‌ఫ్లై బాలికల్లో సంయుక్త (రంగారెడ్డి) స్వర్ణం, తన్వి (రంగారెడ్డి) రజతం, అభినయ (హైదరాబాద్‌) కాంస్యం సాధించారు. బాలురలో ధారా ప్రతీక్‌ (హైదరాబాద్‌) స్వర్ణం, కేతన్‌ రాఘవ (రంగారెడ్డి) రజతం, ప్రతీక్‌ సింగ్‌ (ఖమ్మం) కాంస్యం దక్కించుకున్నారు.

ఆదిలాబాద్‌: జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆదివారం ప్రారంభమైన ఎస్జీఎఫ్‌ రాష్ట్రస్థాయి అండర్‌–19 బాలబాలికల స్విమ్మింగ్‌ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. సోమవారం పలు విభాగాల పోటీల్లో క్రీడాకారులు హోరాహోరీగా తలపడ్డారు. 50 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌, 100 మీటర్ల బటర్‌ఫ్లై, 50 మీటర్ల ఫ్రీస్టైల్‌, 400 మీటర్ల ఫ్రీస్టైల్‌, 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌, 50 మీటర్ల బటర్‌ఫ్లై విభాగాల్లో బాలబాలికలు తమ ప్రతిభను చాటుకున్నారు. ముఖ్యంగా రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల క్రీడాకారులు పతకాల సాధనలో ఆధిపత్యం కనబరిచారు. విజేతలకు డీవైఎస్‌వో దయానందరెడ్డి, ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి ఆడె రామేశ్వర్‌ మెడల్స్‌ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పీడీ సాయికుమార్‌, స్విమ్మింగ్‌ నిర్వాహకుడు రాష్ట్రాపాల్‌, తదితరులు పాల్గొన్నారు.

విజేతలు వీరే..

50 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌ బాలికల్లో సంయుక్త (రంగారెడ్డి) స్వర్ణం, జాగృతి శ్రీవాస్తవ (రంగారెడ్డి) రజ తం, అనిహాశ్రీ (కరీంనగర్‌) కాంస్యం సాధించారు. బాలుర విభాగంలో యాదిప రిత్విక్‌ (రంగారెడ్డి) స్వర్ణం, మోక్ష చంద్ర (ఖమ్మం) రజతం, పృథ్వీరాజ్‌ పాటిల్‌ (రంగారెడ్డి) కాంస్యం గెలుచుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement