తలమడుగు మండలంలోని సుంకిడి ప్రాథమిక పాఠశాలలో 84 మంది విద్యార్థులకు గాను 63 మంది హాజరయ్యారు.
భీంపూర్ ప్రాథమిక పాఠశాలలో 98 మంది విద్యార్థులకు గాను 53 మంది వచ్చారు.
ఇంద్రవెల్లిలోని ప్రాథమిక పాఠశాల–2లో 158 విద్యార్థులకు గాను 91 మంది మాత్రమే హాజరయ్యారు.
నేరడిగొండలోని బుగ్గారం ప్రాథమికోన్నత పాఠశాలలో 125 మందికి గాను 92 మంది హాజరయ్యారు.
జైనథ్‌లోని జెడ్పీఎస్‌ఎస్‌లో 504 విద్యార్థులకు గాను 321 మంది, ప్రాథమిక పాఠశాలలో 143కు గాను 101 మంది హాజరయ్యారు.
ఆదిలాబాద్‌టౌన్: నవంబర్‌లో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు వందశాతం ఉండాలని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు. గైర్హాజరవుతున్న విద్యార్థుల ఇంటికి వెళ్లి పిల్లల్ని బడికి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే జిల్లాలో ఆచరణలో మాత్రం ఆమడ దూరంలో ఉంది. విద్యార్థుల హాజరు 75 శాతానికి మించకపోగా, ఉపాధ్యాయుల తీరు అలాగే ఉంది. ఈ క్రమంలో కలెక్టర్ రాజర్షిషా అటెండెన్స్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. హాజరుశాతం పెంచేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లేకుంటే కఠిన చర్యలు తప్పవని ఆదివారం నిర్వహించిన జూమ్ మీట్లో హెచ్చరించారు. ఈ క్రమంలో సోమవారం జిల్లాలోని పలు మండలాల్లో క్షేత్రస్థాయి పరిస్థితిపై ‘సాక్షి’ విజిట్ నిర్వహించింది. ఇందులో హాజరు అంతంతే ఉన్నట్లు తేలింది.


