కైలాస్‌నగర్: అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్‌తో కలిసి ఎమ్మెల్యే శంకర్ సమీక్ష నిర్వహించారు. రోడ్ల విస్తరణ పనులను ఎలాంటి పొరపాట్లకు తా వులేకుండా ప్రారంభం నుంచి ముగింపు వర కు కచ్చితమైన మ్యాపింగ్ చేయాలన్నారు. అలాగే భూసేకరణ ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేయాలన్నారు. ఇందులో ఆర్డీవో జగదీశ్వర్‌రావు, చీఫ్ ఇంజినీర్ నర్సింగ్‌రావు, ము న్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, ఆర్‌అండ్‌బీ ఈఈ రమేశ్, రైల్వే, ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
ఆదిలాబాద్: నిర్ణీత గడువులోపు రైల్వే వంతెనల పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే పాయ ల్ శంకర్ అన్నారు. ఆర్‌అండ్‌బీ సీఈ(సీటీఈ) నర్సింగ్‌రావు, సంబంధిత అధికారులతో కలిసి నిర్మాణ పనులను మంగళవారం పరిశీలించా రు. భూసేకరణ సమస్యలు, వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా పనుల్లో జాప్యం అవుతుందన్నారు. అన్ని శాఖల అధి కారులు సమన్వయంతో పనిచేయాలని సూ చించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ప్రజలకు ట్రాఫిక్ ఇక్కట్లు తొలగి, రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు.
కలెక్టరేట్‌లో సమీక్ష