ఆదిలాబాద్‌టౌన్: స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, అలాగే బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఆయా స్టేషన్లలో రిసెప్షనిస్ట్ విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో సమావేశం అయ్యా రు. అలాగే స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, సర్కిల్ అధికారులు, డీఎస్పీలతో వీసీ ద్వారా సమీక్షించి పలు సూచనలు చేశారు. ప్రతీ కేసులో సమగ్రంగా, నిస్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టి నిర్ణీత సమయంలో విచారణ పూర్తి చేసి సరైన నివేదిక అందించాలని అన్నారు. ప్రజా సమస్యలను బాధ్యతాయుతంగా పరిష్కరించినప్పుడే పోలీ సు శాఖ గౌరవం, కీర్తి ప్రతిష్ఠలు మరింత పెరుగుతాయని అన్నారు. సమావేశంలో డీసీఆర్బీ ఎస్సై ప్రవీణ్, రిసెప్షనిస్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


