సాక్షి,ఆదిలాబాద్: ఆదిలాబాద్‌లో ఐటీ శకం షు రూ కానుంది. ఇప్పటికే ఇక్కడి నుంచి ఐటీ కంపెనీలు తమ స్టార్టప్స్‌ను డెవలప్ చేస్తుండగా, తాజాగా టవర్ ఏర్పాటుతో వాటికి మరింత ప్రో త్సాహంతో పాటు కొత్త వాటిని ఆకర్షించేందుకు దోహదపడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు చేతు ల మీదుగా దీన్ని బుధవారం ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. రా ష్ట్రంలో ఐటీ రంగాన్ని కేవలం రాజధాని హైదరా బాద్‌కే పరిమితం చేయకుండా, ద్వితీయశ్రేణి నగరాలు, మారుమూల జిల్లాకేంద్రాలకు కూడా విస్తరింపజేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఇందులో భాగంగా ఆదిలాబాద్‌లో అత్యాధునిక హంగులతో నిర్మించిన ఐటీ టవర్ ప్రారంభోత్సవానికి సిద్ధం కావడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా యువతలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
పలుమార్లు వాయిదా పడి..
మావల మండలం బట్టిసావర్గాంవ్ వద్ద జాతీ య రహదారి 44ను ఆనుకుని మూడెకరాల విస్తీర్ణంలో ఐటీ టవర్ నిర్మించారు. తెలంగాణ పారి శ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ నోడల్ ఏజెన్సీగా ప్రాజెక్ట్ పనులు జరిగాయి. రూ.54 కోట్లతో నిర్మాణం పూర్తయింది. టవర్ ప్రారంభోత్సవానికి సంబంధించి పలుమార్లు ఏర్పాట్లు జరిగినప్పటికీ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు నేడు ప్రారంభిస్తున్నారు.
ప్రోత్సాహం..
కేవలం పెద్ద కంపెనీలే కాకుండా, సరికొత్త వ్యా పార ఆలోచనలతో వచ్చే యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్స్‌కు ఈ టవర్‌లోని ఇంక్యుబేషన్ సెంటర్లు, నాలేడ్జ్ హబ్‌లు ఎంతో ఉపయోగపడతాయని ఐటీ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. తక్కువ అద్దెకు ఆఫీస్ స్పేస్ దొరకడంతో చిన్నస్థాయి టెక్ కంపెనీలు పుట్టుకొచ్చేందుకు అవకాశాలుంటాయని పేర్కొంటున్నారు. ఐటీ ఉద్యోగుల రాకతో ఆదిలాబాద్‌లో రియల్ రంగం, హోటళ్లు, రవాణా, విద్య, వైద్యం వంటి రంగాలు వేగంగా పుంజుకునేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. అలాగే స్థానిక యు వతకు గ్లోబల్ మార్కెట్‌కు తగ్గట్టుగా సాఫ్ట్‌వేర్ శిక్షణ, సాంకేతిక నైపుణ్యాలు మెరుగుపర్చుకునేందుకు వేదికగా నిలుస్తుందని చెబుతున్నారు.


