అంతా మా ఇష్టం..! | - | Sakshi
Sakshi News home page

అంతా మా ఇష్టం..!

Nov 11 2026 12:43 AM | Updated on Nov 11 2026 12:43 AM

రిమ్స్‌లో గుట్టుగా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్‌ లేకుండానే గతనెలలో 11 మందికి పోస్టింగ్‌ ఆలస్యంగా వెలుగులోకి..

ఆదిలాబాద్‌టౌన్‌: ఎన్ని విమర్శలు ఎదుర్కొంటు న్నా రిమ్స్‌ అధికారుల తీరు మారడం లేదు. ఇటీవల జరిగిన పొరపాట్లతో అభాసుపాలవుతున్నా చే సిన తప్పులే మళ్లీ చేస్తూ రచ్చకెక్కుతున్నారు. తా జాగా రిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిన గుట్టుచప్పుడు కాకుండా పోస్టులు భర్తీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నోటిఫికేషన్‌ లేకుండా.. అర్హతలు లేకపోయినా.. రిజర్వేషన్‌, రోస్టర్‌ పాటించకుండానే పని కానిచ్చేశారు. రిమ్స్‌ అధికారుల బంధువులు, ఔట్‌సోర్సింగ్‌ నిర్వాహకుల సంబంధికులకు ఈ పోస్టులు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. కాగా, ఆస్పత్రిలో డైరెక్టర్‌ చాంబర్‌ ఎదుట ‘రిమ్స్‌లో ఎలాంటి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగా లు లేవు..’ అనే బోర్డు దర్శనమివ్వడం గమనార్హం.

11 పోస్టుల భర్తీ..

రిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీలో గతనెల 23న 11 పోస్టులు భర్తీ చేసినట్లు సమాచారం. వీటిలో అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌ 1, ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌–2 నాలుగు పోస్టులు, లైబ్రేరి అటెండెంట్‌ 2, ల్యాబ్‌ అటెండెంట్లు 3, ఓటీ టెక్నీషియన్‌ ఒక పోస్టును భర్తీ చేశారు. ఇందులో ఐదుగురు పురుషులు, ఆరుగురు మహిళలకు ఉద్యోగాలు కట్టబెట్టారు. అయితే నిబంధనలు పాటించకుండానే ఈ ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

మేమింతే.. మారమంతే!

ఇటీవల వరుస ఘటనలతో రిమ్స్‌లో లోపాలు వె లుగుచూస్తున్నా.. అధికారుల తీరు మాత్రం మార డం లేదు. జిల్లా ఉన్నతాధికారులతో పాటు రాష్ట్రస్థా యి అధికారులు చివాట్లు పెట్టినప్పటికీ అంతా మా ఇష్టం.. అన్న రీతిలో వ్యవహరిస్తున్నారనే ఆరోపణ లున్నాయి. గతేడాది కూడా నర్సింగ్‌ కళాశాలలో 60 పోస్టులను గుట్టుచప్పుడు కాకుండా భర్తీ చేశారు. నిరుద్యోగుల నుంచి అందినకాడికి దండుకున్నారనే ఆరోపణలున్నాయి. ఈ పోస్టుల్లో కూడా చేతివాటం ప్రదర్శించారనే ప్రచారం సాగుతోంది. అధికారులతో పాటు పలువురు రాజకీయ నాయకులు వీటిని పంచుకున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. ఎలాంటి నోటిఫికేషన్‌ విడుదల చేయకుండా చేపట్టి న తతంగంపై విచారణ చేపట్టి అర్హులైన నిరుద్యోగులకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.

ఈ విషయమై రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్‌ రాథోడ్‌ను వివరణ కోరగా, కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఔట్‌సోర్సింగ్‌ పోస్టులను రద్దు చేసి నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన సంఘటనల్లో బాధిత కుటుంబాలకు పోస్టింగ్‌లు కల్పిస్తామని ఆయన వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement