ఉట్నూర్‌రూరల్: విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం పెంపొందించేందుకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ దోహదపడుతుందని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈనెల 12 నుంచి నిర్వహించే టాలెంట్ టెస్ట్‌కు సంబంధించిన పోస్టర్‌ను తన చాంబర్లో సోమవారం ఆవిష్కరించారు. ఆశ్రమ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులంతా విద్యార్థులతో ఈ పరీక్ష రాయించాలని సూచించారు. కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ ప్రణయ్ కుమార్, ఏటీవో భాస్కర్, వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్, జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ బాబు, గంగన్న, ఉమాకాంత్ పాల్గొన్నారు.


