● రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
కై లాస్నగర్: మెప్మా ద్వారా మున్సిపల్ పరిధిలో స్వ యం సహాయక సంఘాల మహిళలకు అందించే సీ్త్ర నిధి రుణాల రికవరీకి సంబంధించి అక్రమాలు చోటు చేసుకున్నాయి. పలు సంఘాల పరిధిలో రూ.40 లక్షల వరకు నిధులు దుర్వినియోగమయ్యాయి. ఈ పరిస్థితిని వివరిస్తూ ఈనెల 2న రిక‘వర్రీ’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈమేరకు మెప్మా జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ సీవీఎన్ రాజు స్పందించారు. క్షేత్రస్థాయిలో సభ్యుల రుణాల చెల్లింపులను పర్యవేక్షించాల్సిన ఐదుగురు సీవోలకు షోకాజ్ జారీ చేశారు. మంగళవారంలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. వారిచ్చే వివరణ ఆధారంగా బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


