దీపావళి పురస్కరించుకుని తండాల్లో గోదన్ పూజ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. నార్నూర్, గాదిగూడ మండలాల్లో సోమవారం ఘనంగా నిర్వహించారు.
కార్తికం.. శుభప్రదం
శివుడికి ప్రీతికరమైన కార్తిక మాసం నేటి నుంచి షురూ కానుంది. భక్తులు దీపదానాలు, అర్చనలు, అభిషేకాలకు ప్రాధాన్యతనిస్తారు.
ఆదిలాబాద్: జిల్లావ్యాప్తంగా దీపావళి వేడుకలు అంబరాన్నంటాయి. పండుగ పురస్కరించుకుని ఇళ్లు, దుకాణాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. లక్ష్మీదేవికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. వ్రతాలు, నోములు ఆచరించి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. సాయంత్రం ఇళ్ల ముందు దీపాలు వెలిగించారు. చిన్నాపెద్దా తేడా లేకుండా టపాసులు కాలుస్తూ సంబరాల్లో మునిగితేలారు. ప్రజాప్రతినిధులు వేడుకల్లో పాల్గొని ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్‌జాదవ్, మాజీ మంత్రి రామన్న తదితరులు సంబురాల్లో భాగస్వాములయ్యారు.


