ఈ చిత్రంలో స్టాఫ్‌నర్స్ ప్రొవిజినల్ జాబితాలోని కొంత మంది వివరాలు.. ఇందులో రెండో వరుసలో ఓ అభ్యర్థికి సంబంధించిన వివరాలను పొందుపర్చారు. ఆమె పేరు, తండ్రి పేరు కనిపించకుండా ‘సాక్షి’ తొలగించింది. ఆ యువతి 2003లో జన్మించినట్లు ఉంది. బీఎస్సీ నర్సింగ్ కోర్సు ఉత్తీర్ణురాలు అయిన సంవత్సరం 2022గా పేర్కొంటూ ఆ జాబితాలో ప్రచురించారు. అంటే.. 19ఏళ్ల వయస్సులో ఆమె ఆ కోర్సు పూర్తి చేసినట్టు. పదో తరగతి 15 ఏళ్లు, ఇంటర్మీడియెట్ 17 ఏళ్లకు పూర్తయిన తర్వాత బీఎస్సీ నర్సింగ్ నాలుగేళ్ల కోర్సు చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు పందొమ్మిది ఏళ్ల వయస్సులో ఆ కోర్సును ఆమె ఎలా పూర్తి చేసిందో వైద్యారోగ్య శాఖ అధికారులకే తెలియాలి.


